ఉన్నతమైన గుణత్వం --- వి. కృష్ణవేణి, వాడపాలెం, తూర్పుగోదావరి జిల్లా.

ఉన్నతమైన గుణత్వం --- వి. కృష్ణవేణి, వాడపాలెం, తూర్పుగోదావరి జిల్లా.

ఉన్నతమైన గుణత్వం

మనిషి ఉన్నతంగా బతకడానికి
మూలాధారం వ్యక్తిత్వం..
ప్రతివ్యక్తికి ఆత్మభిమానం గొప్పది.దానిని చాటేదే   వ్యక్తిత్వం...
ఇది ఒకకుటుంబంనుండి ఒక సమాజంనుండే వెలువడి...
తనచుట్టూ ఉన్న పరిసరాలనుండి అలవడి..
 తనయొక్కగుర్తింపుకు ఎదుగుదలకు దోహదంచేస్తూ.
కుటుంబ విలువలను కాపాడుతూ..
సంస్కృతీ సంప్రదాయాలను అనుసరుస్తూ
సమాజశ్రేయస్సు,
కుటుంబ సంప్రదాయమే ద్యేయంగా భావిస్తూ..
మానసికంగా దృడంగా ఉండడానికి వ్యక్తిత్వ దోహదం చేస్తుందని,
మంచి వ్యక్తిత్వమే సరైన జీవన మార్గమని చూపుతూ..
సమాజం ధన, కుల, మత, వర్ణ భేదంలేకుండా
సమానత్వాన్ని చూపుతూ
సహాయ సహకారాలతో
నిస్వార్థమయిన సేవాతత్వంతో...
ప్రేమానురాగాలతో
మంచిమర్యాదలతో..
ఆప్యాయతలతో
సరైన మాటతీరు..
సక్రమ నడవడిక..
పెద్దలపట్ల గౌరవ మర్యాదలు కల్గి ఉండడం 
వ్యక్తిత్వవికాశానికి తార్కాణాలుగా  చాటిచెపుతూ..
నడిచే దారి ముళ్లపొదయినా అది
నీతి నిజాయితీ చాటుకునేదిగా..
 ఆదర్శవంతమయినదిగా..
శీలనిర్మాణంగా..
అనుచరనీయంగా..
మార్గదర్శిగా..
జీవనమార్గానికి   సరైన నమూనాగా
నైతిక విలువలను పెంపొందించుకుంటూ..
 వ్యక్తిత్వవికాసం రూపుదిద్దుకోవాలి
అదే నిజమయిన వ్యక్తిత్వం

--- వి. కృష్ణవేణి,
వాడపాలెం, తూర్పుగోదావరి జిల్లా.

ప్రక్రియ :వచనం

0/Post a Comment/Comments