అడవి-తల్లి --- పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు విజయనగరం జిల్లా

అడవి-తల్లి --- పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు విజయనగరం జిల్లా



అడవి-తల్లి

పుడమి నందు ప్రకృతి వరమే అడవి
పుడమి లోని అడవి అందాలు మనవి
అడవితల్లి అపరసంపద అడవి బిడ్డలవి
అభం శుభం తెలియని అడవి బిడ్డలను అర్ధం చేసుకోవాలని నా మనవి

రాతియుగం నుండి నేటియుగం వరకు మారని బ్రతుకులు
అడవిని మాత్రమే నమ్ముకున్న ఆటవిక బ్రతుకులు
అమ్మ వంటిది అడవియని మెలుగుతున్న బ్రతుకులు
కల్లా కపటం తెలియని మసిబారిన
అమాయకపు బ్రతుకులు

విజ్ఞానం తెలిసినవాడు విర్రవీగిన
వినయం తో ముందడుగు వేస్తున్న జీవులు
వనసంపద తమ సంపదని తెలిసి తెలియని ఆటవిక జీవులు
పరాయివాడుపెత్తనంచలాయించిన ప్రశ్నించని శ్రమజీవులు
ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందినా ఆటవికాన్ని నమ్ముతున్న అడవి జీవులు

తరాలు మారినా అంతరాలు పెరిగిన మారని జీవితాలు
స్వార్ధం తో ముందుకెళ్తున్నా ఈ ప్రపంచంలో నిస్వార్ధమైన జీవితాలు
గుక్కెడు గెంజి పిడికెడు మెతుకులుకె బలవుతున్న జీవతాలు
నాగరికపు ప్రపంచంలో ఆనాగరికపు జీవితాలు

నమ్మినవారికి ప్రాణం ఇచ్చే మన్య జీవులు
నమ్ముకున్న అడవితల్లిని అమ్మని
నిక్కచ్చి జీవులు
మనిషిని మనిషి గా గుర్తించని ఈ జగతిలో విలువ లేని విలువైన జీవులు
బంగారు భవితవ్యం కోసం ఆలోచించని స్వచ్ఛమైన మానవ జీవులు
త్వరలోనే వాళ్ళకి నవనాగరిక ప్రపంచం అర్ధం అవుతుంది అని ఆశిద్దాం

 రచన: పసుమర్తి నాగేశ్వరరావు
             టీచర్ సాలూరు
             విజయనగరం జిల్లా
             9441530829

0/Post a Comment/Comments