వ్యక్తిత్వ వికాసం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

వ్యక్తిత్వ వికాసం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)



వ్యక్తిత్వ వికాసం

ఎదగడం కాదు ఒదగడం గొప్ప
ఎంత ఎత్తుకెదిగిన ఒదిగి ఉండడమే నిజమైన వ్యక్తిత్వం

భాషణమే వ్యక్తికి భూషణం కావాలి
బాహ్య సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యం మెరావాలి
చిరుమందహాసమే చిద్విలాసమై ఉండాలి
ముఖవర్ఛస్సే వ్యక్తిత్వానికి సూచిక

స్వచ్ఛత పవిత్రత వ్యక్తి మనోవికాశానికి తార్కాణాలు
నిష్కలంకం నిర్మలత్వం నిరాడంబరత నిజమైన ఆభరణాలు
పరనింద పరముఖస్తుతి లేకుండాలి
కుసుమ పరిమళం వెదజల్లినట్లు వ్యక్రి వికాసం ఉండాలి

శ్రీ రామచంద్రుని ముఖ వర్చస్సు
స్వామి వివేకానందుని తేజస్సు
రామకృష్ణుని దివ్యపు కాంతులు
వ్యక్తిత్వ వికాసానికి మంచి ఋజువులు

ఎదిగినపుడు మనిషి ఎగిరిపోవడం కాదు
ఏమి లేనివారిని ఎదిరించడం కాదు
నీడనిచ్చే తరువులా తరగని ఎరువులా ఉండాలి
తరువు ఎదిగే కొద్దీ ఆశ్రీతులు పెరిగినట్లు వ్యక్తిత్వ వికాసం ఉండాలి

నేటి కాలం లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించు కోవడానికి
సత్యం శివమ్ సుందరం
బుద్ధం శరణం గచ్ఛామి
సబ్ కా మాలిక్ ఏక్ అని గుర్తించాలి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
           9441530829

0/Post a Comment/Comments