స్నేహం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్నేహం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

స్నేహం..!(కవిత)

ఇలాంటి స్నేహితులు 
ఎవరికి కావాలి..!??
బిర్యానీ,
మందు.. పార్టీలు
మాత్రమే కోరేవాళ్లు,
నిజమైన స్నేహితులా..!?
ఎప్పుడూ 
తినడం ,
త్రాగడం.. గురించి ఆలోచించే వాళ్ళు మిత్రులా..!??
చెడు వ్యసనాలను పరిచయం చేసి,జీవితాల్ని 
నాశనం చేసే మహానుభావులు,వీళ్ళా..మంచి స్నేహితులు..!??
తాగుబోతులుగా..
తిరుగుబోతులుగా..
సమాజంలో 
ఆవారాలుగా..
మార్చే..
ఇలాంటి స్నేహాన్ని 
ఎవరు కోరుకుంటారు..!?
ఎలాంటి స్వార్థం కోరనిదే నిజమైన స్నేహం..!
ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక కష్టాల్లో ఆదుకునేది..నిజమయిన దోస్తీ..!?
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments