నా బాల్యం..అమూల్యం..!
మా ఊరి పొలిమేరల్లో,
నా ఊరి,చింత చెట్ల దరిదాపుల్లో..
నా బాల్యం ఎంతో సంతోషించింది..!
నా మనస్సులో..
ఎలాంటి ఎదారు లేని..
చింత లేని,
నాటి నా అమూల్య సమయం..
నాబాల్యం..!అమూల్యం..!!
గోళీల ఆటలు..,
సైకిల్ చక్రం తిప్పుతూ .
వీధివీధి అంతా
సంతోషంగా పరుగెత్తింది ..
నా బంగారు బాల్యం..!
చిన్న నాటి మిత్రులూ,నేను కలిసి ఆడుకున్న ఆటలు., ఓ జ్ఞాపకం..,
మధురాతి మధురం..!
అవ్వతాతల..తో
ముచ్చటలాడిన నా బాల్యం,
అమోఘం..,అపూర్వం..!
అమ్మ నాన్న,అన్న,అక్కలతో..దిగిన ఫోటో ఓ,మర్చిపోలేని జ్ఞాపకం..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,
తెలంగాణ.