ప్రక్రియ: సున్నితం
రూపకర్త: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
1)
పలకరింపు పన్నీటి చిలకరింపు
చిరునవ్వుల స్వాగతంతో మహాసొంపు
మనసును ఆనందంతో నింపు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
2)
అపరిచితులను ఆత్మీయులను చేయు
దూరమందున్నా దగ్గరితనం తోచు
స్నేహసంబంధాలను ద్విగుణీకృతం చేయు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
3)
కష్టాల్లోనున్నవారిని ఆదరంతో పలకరించు
సాంత్వన జల్లులు చిలకరించు
కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని దరిచేర్చు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
4)
నేటికాలంలో వాట్సాప్ పలకరింపులే
మొక్కుబడిగా వెలువడే పలుకులే
పరిమళం లేని కాగితంపూవులే
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
5)
బాగున్నారా అంటూ పలకరింపు
హృదయానికి కలిగించు పులకరింపు
అనుబంధాలను పదిలంగా పదిలపరచు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
*********************************
_ చంద్రకళ దీకొండ,
మల్కాజిగిరి,
మేడ్చల్ జిల్లా.