తొలి ఏకాదశి

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి

మనం ఏ మంచిపని ప్రారంభించినా, దశమి ఏకాదశి ల కోసం ఎదురు చూస్తాం. సంవత్సరమంతా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాడం మాసం శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశిగా పేర్కొంటాము, పూర్వం రోజుల్లో సంవత్సరారంభం గా పరిగణించేవారు. వానాకాలం మొదలు అవ్వడం. అనారోగ్యాలు రావడం సహజం. శరదృతువు(యముని కోర) ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలకు పుణ్య కార్యాలకు అధికం.

సాంఘికంగా కూడా ఈ ఏకాదశి చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే, భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. ప్రజలు నిద్ర సమయం పెరుగుతుంది. వానాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో మొదటి ఏకాదశి, కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని అంటారు. ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు. మనిషి ఈ పదకొండింటికి ని అదుపులో ఉంచుకోవాలి.వాటిని అన్నిటినీ అదుపు ఉంచుకొని, మనసును నైవేద్యంగా దేవునికి సమర్పించాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని. రోగాలు రావు ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది.

పురాణం ప్రకారం ఆషాడ మాసం శుక్ల పక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్ర లోకి వెళ్లే సమయాన్ని తొలి ఏకాదశిగా పేర్కొంటారు. దీనినే శయన ఏకాదశి అని అంటారు. సతీ సక్కుబాయి ఈ రోజునే స్వామి సన్నిధికి చేరి మోక్షం పొందింది. ఈరోజు ఉపవాసం వుండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి నాడు. విష్ణుమూర్తి  పూజ ముగించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, తర్వాత భోజనం చేస్తే పుణ్యం ఉందని నమ్మకం. అలాగే ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు.అలాగే పురాణాలలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది.సూర్యవంశం లో  ప్రఖ్యాత రాజు మాంధాత, అతడు ధర్మ తత్పరుడు, సత్యసంధుడు. అతని రాజ్యములో ఒకసారి కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంగీరస మహర్షి సూచనపై రాదు ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. వ్రత ప్రభావముతో పుష్కలంగా వర్షం కురుస్తుంది.ప్రజలు బాధలు తొలగి సుఖశాంతులతో జీవిస్తారు. అలాగే ఖగోళంలో కూడా ఏకాదశి రోజు మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు అప్పటివరకూ ఉత్తరదిక్కులో ప్రవేశించిన సూర్యుడు. ఈరోజు నుండి దక్షిణ దిక్కుకు ప్రయాణం మొదలుపెడతాడు. ఈ నెలలోనే ప్రకృతి, పర్యావరణంలో మార్పులు వస్తాయి. శరీరం జడత్వం వచ్చి రోగాలు వస్తాయి, ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధ మవుతుంది. దేహానికి కొత్త తేజస్సు వస్తుంది. ఈ పండుగనాడు ముఖ్యంగాపేలపిండిని తినే ఆచారం ఉంది. పేలాలు, బెల్లాన్ని యాలుకలు నీ దంచి పిండి తయారు చేసి, ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆరోగ్య రంగా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలను గుణంగా శరీరాన్ని మార్పులు చేస్తుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభం సమయం కావున తీరానికి ఈ పిండి వేడి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.వర్షాకాలం రోజుల్లో ఈ పేలపిండి అనేక రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి ఉంది.

కొప్పుల ప్రసాద్,
నంద్యాల.
9885066235

0/Post a Comment/Comments