బ్రహ్మకు మరో రూపం గురువు --- కల్పన దేవసాని, కామారెడ్డి.

బ్రహ్మకు మరో రూపం గురువు --- కల్పన దేవసాని, కామారెడ్డి.

బ్రహ్మకు మరో రూపం గురువు

అమ్మానాన్నల సాంగత్యంలో
ఉసురు పోసుకున్న 
జీవితమనే నా ప్రస్థానం 
బడి అనే గుడిలో
గురువు అనే దేవునిసన్నిధిలో 
ఊపిరి పోసుకుంది 
జ్ఞానమనే బతుకు పుస్తకం
ఊహ తెలిసిన క్షణం నుండి
కన్ను మూయు వరకు 
అక్షరాల రూపంలో 
జీవితాన్ని సుందరంగా
మలిచే దిశలో మార్గదర్శిగా 
మంచి చెడులు 
మానవతా విలువలు 
జీవిత పాఠంగా బోధించి..
రూపం లేని రాయిని 
శిల్పంగా మార్చిన
జీవితానికి సార్థకతను చేర్చిన
బ్రహ్మకు మరో రూపం గురువు
ఆ గురువు పోసిన 
అమృతంతో నా జీవితం
చరితార్థం అయ్యింది
ఆ తరుణంలో
నేనొక గురువునై 
భావి భారత పౌరులను 
తీర్చిదిద్దే క్రమంలో 
నా గురువు రుణం
తీర్చుకునే దిశగా సాగుతోంది 
నా బతుకు పుస్తక ప్రయాణం

--- కల్పన దేవసాని,
కామారెడ్డి.

0/Post a Comment/Comments