అమ్మోరు
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్
ఆషాఢ మాసాన బోనాల సంబరం.
ఎల్లమ్మకు సాక వోసి,
కదిలిన జనసందోహం.
శివసత్తువుల మల్లమ్మ గానం
పరవశించి ఊగేను జాతర జనం
ఉత్సాహంతో మాయదారి మైసమ్మ
పాటకు తీన్మార్ నృత్యాలు
సల్లంగ జూడుమని పోశమ్మకు మొక్కులు,
అమ్మవారి బోనాలకు ఆడపడచులు
బోనాలెత్తిన దృశ్యం
తెలంగాణ ఘనసంస్కృతికి
నీరాజనాల నిదర్శనం.