మంచి నిదర్శనం..!(కవిత)
అందమైన చందమామ,
చల్లని వెన్నెలను కురిపిస్తూ..
లోకానికి సుఖ నిదురను అందిస్తున్నాడు...,
మంచి గుణానికి ఇదొక నిదర్శనం..!
అందమైన గులాబీ,
ఘుమ ఘుమల.. గుబాళింపు,జగత్తు మైమరపు..,
మంచి గుణానికి ఇదొక నిదర్శనం..!
తేనె టీగ అనంత చెట్ల పూల పరిమళం గ్రహించి,
అతి కమ్మనైన,తీయనైన తేనెను అందిస్తోంది..,
మంచి గుణానికి ఇదొక నిదర్శనం..!
నల్లనైన కోయిల,
అందమైన వసంత గానంతో ఎంతో హాయిని ప్రకృతిలో వెదజల్లుతోంది...,
మంచి గుణానికి ఇదొక నిదర్శనం..!
అందమైన దేవుని ఈ సృష్టిలో,ఇలా ఎన్నెన్నో జీవులు
లోకపరమార్థమై పుట్టాయి..,
మంచి సేవాగుణమే,వాని ఉనికికి నిదర్శనం..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.
9705235385.