🔥విప్లవ జ్యోతి🔥
గిరిజనుల జీవన పోరాటంలో
అలుపెరుగని కెరటం
మన్యం ప్రజలకు ఆశాజ్యోతి
తెలుగు నేలకు దివ్య కాంతి
మన అల్లూరి సీతారామరాజు
స్వాతంత్ర్య సమరంలో
ఆంగ్లేయులను మట్టి కరిపించిన
మన్యం వీరుడు మన అల్లూరి
దేశ అభివృద్ధికై పరిరక్షణకై
దేశ విదేశాలలో పర్యటించి
అక్కడ సభలలో వందేమాతరం
అనే నినాదాన్ని వినిపించిన విప్లవ వీరుడు
మన అల్లూరి సీతారామరాజు
ఎన్నో సకల శాస్త్రాలలో విలు విద్యలలో ప్రవీణుడు
బ్రిటీష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి
భరతమాతకు జేజేలు పలికిన తెలుగుతేజం
ఆ విప్లవజ్యోతికి అరుణారుణ వందనాలు
అంతటి మహనీయుని స్మరించుకుందాం!
*************************
__ ముత్యం వెంకటేశ్వరరావు,
గురజాల, గుంటూరు జిల్లా.