ఆన్లైన్ చదువులు - మార్గం కృష్ణ మూర్తి

ఆన్లైన్ చదువులు - మార్గం కృష్ణ మూర్తి


ఆన్లైన్ చదువులు

కరోనాతో  మూతబడే పిల్లల బడులు
ఆన్లైన్ పాఠాలతో ముడిపడే, విద్యార్థుల చదువులు
ఆగమై పోవుచుండే విద్యార్ధుల జీవితాలు
తల్లి దండ్రులకు పెరుగుతుండే భారాలు!

పిల్లలకుచరవాణులివ్వొద్దని నాడుచెప్పిరాయే
నేడు చరవాణులులేకుండా రోజుగడువదాయే
ఆన్లైన్ చదువలతో విద్యార్ధుల బ్రతుకులాగమాయే
నేడుపిల్లలజీవితాలు ఆడవికాచిన వెన్నలాయే
గురు శిష్యుల బంధాలు దూరమాయే!

అమ్మ పని అమ్మది , నాన్నపని నాన్నది
పిల్లలవి అంతర్జాల చదువులు
టీచరడిగిన ప్రశ్నలకు జవాబులు శూన్యం
కొడుతదన్న దిగులు లేదు, కోప్పడుతదన్న భయం లేదు!

చేతికి చరవాణి రాగానే,పాఠాలు ప్రక్కన బెట్టిరి
టిక్ టాక్ , వాట్సాప్ , ఫేస్ బుక్ , సెల్ఫీలు
గేములు,అశ్లీల వీడియోలతోకాలం గడిపిరి
అమ్మా నాన్నలకు పచ్చి అబద్ధాలు చెప్పిరి!

విద్యార్ధులు బడులకు వెళ్ళకుండానే
టీచర్లు  పాఠాలు చెప్పకుండానే
ప్రశ్న పత్రాలు లేకుండా‌,జవాబులు లేకుండానే
తెలివైన విద్యార్ధిని , తెలివి లేని విద్యార్ధిని
అందరూ ఉత్తీర్ణులైతిరని ఒక్కమాటన చెప్పే!

నేడు విద్యార్ధులు ,చరవాణులకు బానీసలైరి
అన్నము నిద్రలనైనా  ఆపగలరు
చరవాణి లేకుండా బ్రతక లేరు
క్రమశిక్షణలేకుండాపోయే , చెబుతే వినరైరి
ఇంటి గొడవలు అన్లైన్లో , రచ్చకెక్కించిరి!

చరవాణిపై అవగాహన లేకుండే
ఏది బడితే ఆ బటన్ వత్తుతుండే
పబ్జి గేములకు అలవాటు పడుతుండే
డాటా అంతా గల్లంతు అవుతుండే
సైబర్ నేరగాళ్లచేతుల్లోకి డబ్బుపోతుండే
ఆరోగ్యం చెడుతుండే, ఆత్మహత్యలంటుండే!

---మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్




0/Post a Comment/Comments