వరకట్నం (ప్రక్రియ:సున్నితం)-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

వరకట్నం (ప్రక్రియ:సున్నితం)-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

వరకట్నం (ప్రక్రియ:సున్నితం)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

అంతటా వరకట్న వేధింపులు
అనాదిగా అత్తల సాధింపులు
ఆహుతే  నూరేళ్ళ జీవితాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వరకట్నమే ఒక  దురాచారము
తలపెట్టు  తరుణులకు అపకారము
నవవధువుల బ్రతుకులు బలిదానము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఎన్నెన్నో చట్టాలు వచ్చినా
మహనీయులు గొంతెత్తి చెప్పినా
సమాజంలో మార్పు వచ్చేనా?
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వ్యవస్థలో కనువిప్పు కలగాలి
మదిలో  ప్రక్షాళనము జరగాలి
వరకట్న గ్రహీతులిక మారాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వరకట్నం సమాజ చీడపురుగు
అనార్ధాలు సహృదయంతో ఎరుగు
అభ్యాగుల  ఆత్మహత్యలు తరుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

-గద్వాల సోమన్న, 
గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు.
 〰️〰️〰️〰️〰️〰️〰️〰️

0/Post a Comment/Comments