మా గురువులకు వందనం
మాతృదేవోభవ పితృదేవోభవ
గురుదేవోభవ అన్నారు లే పెద్దలు
వీరివల్ల లభ్యం మనకెన్నో విద్యలు
చదివి ఎదిగి ఎక్కాలి మనం గద్దెలు
మీరు విన్నారుగా ఇక ఈ సుద్దులు
మారాలి క మన అందరి బుద్ధులు
గురువుల గొప్పతనం గుర్తిద్దాం
ఆ దిశగా మనమంతా ప్రవర్తిద్దాం!
ప్రత్యక్ష దైవం మనల కన్న అమ్మ
ప్రత్యక్షంగా కనిపించే వైనంనీవమ్మ
లక్షణంగా మా అమ్మే మా మొదటి గురువు
అక్షర లక్షల ఫలాలు అందించే మా కల్పతరువు
నవ మాసాలు తన గర్భ లో మోసి
హృదయ ఫలకంపై అక్షరాలను తాను రాసి
జన్మనిచ్చి జగతికి పరిచయం చేసిన అమ్మ మన మొదటి గురువు
ఆ అమ్మకు వందనం అభివందనం.
మాఅమ్మ్మమాటను విను కొని
మా చదువుల బాట ను కనుగొని
తాను అడిగినవన్నీ కొనిచ్చి మెచ్చి
లాలించి ప్రేమించి బడికి మమ్ముల తోలించి మా ఉన్నతికై నిత్యం శ్రమించే మా నాన్నే మా రెండవ గురువు.ఈ గురువుకు వందనం
అభివందనం
బడిలో అక్షరాలను మాచే దిద్దించి
పలు పాఠముల తాను చదివించి
ఎక్కాల ను మా బాగా రాయించి
లెక్కల్లో మమ్ముల తీర్చిదిద్దిన మా
చిన్నప్పటి మా బడిలోని మాస్టారే
మా ముద్దుల మూడవ గురువు
వీరికి వందనం అభివందనం!
ముమ్మూర్తులా త్రిమూర్తులైన మాఅమ్మ నాన్న గురువు ఈ ముగ్గురు గురువులకు వందనం
అభివందనం మా సుమచందనం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా