విప్లవ బాణం...! ---కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.

విప్లవ బాణం...! ---కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.


విప్లవ బాణం...!

--- కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), 
ఖమ్మం.

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం పై యుద్ధం ప్రకటించి
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడతను!

వరుస దాడులతో బ్రిటీష్ ప్రభుత్వాన్ని  దెబ్బతీసిన
మన్యం ప్రజల చీకటి బ్రతుకుల విప్లవ  జ్యోతి అతను!

మన్యం విప్లవ దళం నిర్మాణం చేసి
తెల్ల దొరలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అగ్గిపిడుగు అతను!

గిరిజనులను సమీకరించి తిరుగుబాటుకు బాటలు వేసి
బ్రిటీష్ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన మహోజ్వల శక్తి అతను!

చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలి సారి దాడి చేసి
గంటం దొర మల్లు దొర  సేనలను కలిగిన నాయకుడతను!

సంస్కృతం జ్యోతిష్యం జాతక శాస్త్రం నేర్చిన
విలువిద్య గుర్రపు స్వారీ లో నేర్పరి అతను!

బ్రిటీష్ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా
మన్యం ప్రజలను యుద్ధానికి  సన్నద్ధం చేసిన శిక్షకుడతను

బాధిత గిరిజనుల క్షేమం కోసం
ప్రాణత్యాగానికి సిద్ధ పడ్డ త్యాగ మూర్తి అతను!

రూథర్ ఫర్డ్ చింత చెట్టుకు కట్టి కాల్చిన చింతించక 
చివరి రక్తపు బొట్టు చిందేదాక వందేమాతరం నినాదం చేసిన పిడికిలి అతను!

అతడే... స్వాతంత్ర్య  ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం
వెంకట రామరాజు సూర్య నారాయనమ్మ  ముద్దు బిడ్డ 
మన తెలుగు గడ్డ పై మొలకెత్తిన విప్లవ బాణం అల్లూరి సీతారామరాజు...!

0/Post a Comment/Comments