అక్షరమాలికలు

అక్షరమాలికలు


*అక్షర మాలికలు*
పేరు:పిల్లి.హజరత్తయ్య
చరవాణి: 9848606573
ప్రక్రియ: అక్షర మాలికలు
➿➿➿➿➿➿➿➿
*1.ఏకపది:(కుటుంబం)*

ఆత్మీయత.. అనురాగాల.. కలబోత కుటుంబము
అద్భుతమైన సామాజిక వ్యవస్థకు మూలం కుటుంబము

*2. ద్విపది: (కలతలు)

ప్రతి కుటుంబంలో కలతలు మామూలే
కలతలతో కలబోసిన కాపురమే కుటుంబము

జీవితంలో కలత చెందనోరు ఉండరు
కలత చెందితేనే కల సాకారమవుతుంది

*3.త్రిపదం: (వేధింపులు)*

పని చేసే ప్రతి చోట స్త్రీకి వేధింపులే..
స్త్రీ శక్తికి అడుగడుగునా ఈసడింపులే..
వేధింపులలోను ఆమె పోరాట పటిమ ప్రదర్శిస్తుంది.!

ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు
జీవితంలో వేధింపులకు గురవుతుంటారు
వాటికి భయపడితే శిఖరాగ్రాన్ని చేరుకోలేం కదా..!!
 
*4.చతుర్ద పదం: (వేరు కాపురాలు)*

కొత్తగా పెళ్ళైన యువజంటలు
వేరు కాపురం పెట్టడానికి ఆసక్తి చూపుతారు
కుటుంబంతో కలిసి నడవడమంటే
అనురాగపు లోగిళ్ళను నిర్మించడమేనని మరుస్తారు

వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండకుండా
చిన్న సమస్యలకే బయటకు వెళ్ళిపోయి
వేరే కాపురం పెట్టడానికి మొగ్గు చూపితే
నీ వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చునేమో..!!

➿➿➿➿➿➿➿➿
పిల్లి.హజరత్తయ్య

0/Post a Comment/Comments