పెద్దలమాట...సద్దిమూట... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

పెద్దలమాట...సద్దిమూట... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

పెద్దలమాట...సద్దిమూట

ఔను
మన మతాన్ని
పూజాగదిలోనే బంధించాలని
అది గర్భగుడిలోనే
సుందర దేవతాశిల్పమై పోవాలని
అది వేసే ధూపంలో కలిసి పోవాలని
చేసే‌ అర్చనలకే అర్పణమైపోవాలని

ఔను
మన కులాన్ని
నాలుగుగోడలకు
పరిమితం చేయాలని
గడపదాటి బయటకు రానివ్వరాదని
కులంగొప్పదంటూ కులకరాదని
కులంపేర మతంపేర కుమ్ములాటలొద్దని

బయట
మనందరం
భారతీయులమని
భరతమాత ముద్దుబిడ్డలమని
అరమరికలులేని అన్నాతమ్ముళ్ళమని
కలతలన్నవి లేక కలిసి మెలిసి వుండాలని
భిన్నత్వంలో ఏకత్వమే మన నినాదామని
కదా మన పెద్దలమాట
అదే కదా సదా మన ఆకలితీర్చే సద్దిమూట

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments