కలియుగ దైవం
అమ్మ జీవం పోస్తుంది..
వైద్యుడు పునఃజీవం పోస్తాడు..
ఆ తెల్లని కోటు శాంతికి, స్వచ్చతకు సంకేతం..
చల్లని మనసు..,రోగులను పసిపిల్లల్లా చూసే దయాగుణం..,ఆ తెల్లని కోటు వెనుక ఉన్న మనసులో.. దాగున్న మహానియుడు వైద్యుడు.
ఆగిపోయె శ్వాసను నిలిపే దైవం అతను..
దైవం మనకు కనిపించదు..కాని, దైర్యాన్నిస్తుంది..అదే,
వైద్యుడు మన కళ్ల ముందు ఉంటాడు..మనకు అయుష్సుపోసి అతనే దైవం అవుతాడు.
ఇప్పుడున్న సమాజంలో..మన ప్రజలను గజగజ వణికిస్తున్న మహమ్మారి నుండి కాపాడడానికి తమ కుటుంబాలను విడిచి..రెయింబవళ్లు కష్టపడుతూ..తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..
మహమ్మారిపై మీ పోరాటం..
సరిహద్దు అంచున సైనికులు చేసె పోరాటాన్ని మించిన సహసం మీది.
"వైద్యో నారాయన హరి" అని,
అప్పుడే అన్నారు మన పెద్దలు..
వైద్యుడే మన కలియుగ నారాయనుడు..,
కలియుగ దైవం.
సెల్యూట్ వైద్యులరా..సెల్యూట్
అందుకొండి ఇదుగో..మా శతకోటి వందనాలు.
పేరు: పుల్లూరి సాయిప్రియకలం పేరు: ప్రియ సరస్వతిఊరు: చౌడారంజిల్లా: సిద్దిపేట