అంశం:అక్షర క్రమ కవిత
సామజవరగమన సామజవరగమన
సరిలేరునీకెవ్వరు
సా గిపో నీ జీవితాన సరి కొత్త కాంతులతో
మ దిలో మెదిలే కోటి ఆశలతో సాగిపో
జ డివాన ప్రవాహలు అడ్డొచ్చిన సాగిపో
వ డివడిగా పోరాడే బెబ్బులి వయి సాగిపో
ర ౦గుల కలల హరివిల్లు రెక్కలపై సాగిపో
గ మ్యం నిన్ను చేరే వరకు సాగిపో
మ మతల అనురాగపు మందారానివై సాగిపో
న వ్వించే నేస్తానివై సాగిపో
సా గరం ఈదే నావాల సాగిపో
మ హోజ్వల కాంతివై వెలుగునిస్తూ సాగిపో
జ నులగుండెలో నిలిచే కీర్తి వై సాగిపో
వ సుదైకకుటుంబంలోఅందరిబందువైసాగిపో
ర క్షణ కరువైన జగతికి రక్షకుడై సాగిపో
గ ళం విప్పి కదం తోక్కిఉప్పెనలా సాగిపో
మ ధురమైన మాటల పూదోటలా సాగిపో
న డిచే దైవానివై నలువైపులా
ప్రజ్వలిస్తూసాగిపో.
పేరు: ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్