బాలల గేయం
అక్షరాలను మనము దిద్దుకుందామా
చదువును బాగా నేర్చుకుందామా
చదువులమ్మను కొలుచుకుందామా
గురువులను పూజించుకుందామా
పలక బలపం పడదామా
ఆడుతూ పాడుతూ బడికి పోదామా
ఆనందంగా మనము వుందామా
సరదా సందడి చేద్దామా
బడివనం ను తయారు చేసుకుందామా
అక్షర మొక్కలను నాటు కుందామా
విజ్ఞాన పూలూ పూయించు కుందామా
జ్ఞాన మాలికలు ను తయారు చేసుకుందామా
చేయి చేయి కలుపుకుందామా
స్నేహాన్ని పెంచు కుందామా
ఐక్యతకు బాటలు వేసుకుందామా
సమైక్యతను చాటుకుందామా
భావి భారత పౌరులుగా తయారవుదామా
భారతమాత బిడ్డలమని ఎలుగెత్తి చాటుదామా
భవితకు పునాదులు వేసుకుందామా
భారతావనిని మహోన్నతము గా తయారు చేసుకుందామా
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు టీచర్
విజయనగరం జిల్లా
9441530829