విద్యాలయం నాదేవాలయం
శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు :హైదరాబాద్
బుడి బుడి నడకలు తో
నడత నేర్పిన నా బడి
సత్ పలుకుల వాగ్దేవి గుడి
సభ్యతాసంస్కారాల ఒడి
ఆహ్లాదకర ప్రకృతి పడి
అక్షర సేద్యపు వరిమడి
బడిలో నేర్చాను పసిడి అక్షరాలు.. ఆ ఆ లు నేర్పిన
గురువులకు వేసాను అక్షరపు హారాలు...
గురు బోధనతో సద్గురు దీవెనతో సాధించాను
జీవిత సత్యాలని సంసార సాగరాన్ని
నాబడి వాల్మీకి ఆశ్రమం
నా పాఠశాల విశాల భావాల
విజ్ఞాన ఆశ్రమశాల....
నా గురువులు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు...
జీవన మార్గదర్శకాలు...
సజీవ స్వప్నం నాబడి
విద్యాలయ మే నా దేవాలయం
గురువులే నా దైవాలు.....
విశాల ప్రాంగణంలో ఎందరో భావి పౌరులను తీర్చిదిద్దిన
నా పాఠశాల అవని కే ఆదర్శం.......
ప్రక్రియ :వచనం