నిజమైన శాంతి..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నిజమైన శాంతి..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నిజమైన శాంతి..!(కవిత)
******✍🏻విన్నర్******
అన్నీ ఉన్న జీవితాల్లోనే 
ఈ అలజడి 
ఎందుకు..!??
ఎందుకు 
ఈ అసంతృప్తులు..!??
ఏం తక్కువని..?
సిరి సంపదలు 
అన్నీ ఉన్నా
ఈ అశాంతియుత 
జీవితం ఏమిటీ..!??
ఎందుకు 
ఈ సుఖం లేని బ్రతుకు..!??
కార్లూ..,
బంగళాలు..
డబ్బు.., 
ఆస్తులు గట్రా 
జీవితానందాన్నివ్వవు..!??
అని అర్థమవుతోంది..!
నిజమైన ఆనందం,
నిజమైన సుఖం,శాంతి..
వస్తువులలో ఉండదని స్పష్ట మవుతోంది..!??
మనిషిలో ఆధ్యాత్మిక భావన
మేలుకొనిన నాడే..
ఆనందం,నిజమైన సంతోషం..!
స్వత:గా మదిలో పుట్టేదే 
నిజమైన శాంతి వగైరా..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments