డా.APJ అబ్దుల్ కలాం గారి సేవానిరతి--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.

డా.APJ అబ్దుల్ కలాం గారి సేవానిరతి--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.

డా.APJ అబ్దుల్ కలాం గారి సేవానిరతి
-----------------------------------
"అబ్దుల్ కలాం" సర్వోన్నత వ్యక్తి
శాస్త్రవేత్తల్లో వారొక శక్తి
దేశమంటే అంతులేని భక్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంచెలంచెలుగా ఇల ఎదిగారు
'నిరాడంబరం' బ్రతికి చూపారు
విలువైన వినయంతో ఒదిగారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

దేశకీర్తి గొప్పగ చాటినారు
కలాం విశ్వవ్యాప్తి చేసినారు
సాంకేతికంగా కృషి చేశారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అందరికీ మిక్కిలి ఆదర్శము
సాటిలేని ప్రతిభకు నిదర్శనము
కొలవాలి గుండెల్లో అనుదినము
చూడచక్కని తెలుగు సున్నితంబు

రామేశ్వరం పల్లెన  పుట్టారు
మనదేశ రాష్ట్రపతి అయ్యారు
యువతకు ఉన్నత స్ఫూర్తినిచ్చారు
చూడచక్కని తెలుగు సున్నితంబు
--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments