వింత చోద్యం...గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,సెల్:9966414580.

వింత చోద్యం...గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,సెల్:9966414580.

వింత చోద్యం...
------------------------------
మహిలో నైతిక విలువలు
ఎండమావులకు నిలయము
మనిషితనం అడుగంటిన
భూగర్భ జలాల సమము

మది వనమున ప్రేమపూలు
తగ్గుముఖం పడుతున్నవి
నిర్లక్ష్యము నీడలో
అంతరించుపోతున్నవి

పెద్దల పట్ల గౌరవం
మసకబారి పోతున్నది
వారు చెప్పు హితబోధలు
నేలపాలు అగుతున్నవి

కన్నబిడ్డలున్న కూడా
కన్నవారు అనాథలు
అవసాన దశలోన వారి
చోటు శరణాలయాలు

--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments