చిరునవ్వులనే మెతుకులుగ మార్చిండ్రు
నా కడుపు నింపేసిండ్రు ఈ చిట్టితల్లుల చిరునవ్వులతో
ఇంద్రధనుస్సును తాళ్ళుగజేసి
ఆకాశానికి ఉయ్యాలేసినట్లుంది
పత్తిపువ్వులు పగలబడి నవ్వుతున్నాయ్
రంగరంగు వస్త్రాలతో మీ ముందుకొస్తున్నానని
ఎక్కిల్లు పట్టినట్లుందేమొ వేరుశనగకు
తొలకరి సినుకులతో గొంతు తడుపుకుంటుంది
వగలుపోతున్న సింతసిగురు
వయ్యారాలు ఒలకబోస్తుంది
సింతలేని వేపమాను
సద్దిగిన్నెల్ను మోసుకు నిలబడే ఉంది
యాలపొద్దయ్యింది ఎప్పుడొస్తారోనని
సీరకొంగుతో సిరుసెమట సుక్కల్ని
నుదిటి రాతల్ని కలిపి తుడిపేసుకుంటు
సతికిలబడి సద్దులిప్పుకుంటు
కులాలన్నింటిని మతాలన్నింటిని కలిపి
ముద్దలుగచేసి కడుపునింపుకుంటుండ్రు
అమ్మలక్కలందరు
ఇది జానపదాల జాతర
నా పల్లె పదాలమోతర
మీ
అన్వేషి ✍️
పి వినోద్ కుమార్
జోగులాంబ గద్వాల జిల్లా
9640277335