పవిత్ర గంగాజలం . (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర .సెల్ నెంబర్ 9491387977.

పవిత్ర గంగాజలం . (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర .సెల్ నెంబర్ 9491387977.

@💧 పవిత్ర గంగాజలం💧
_____________________
విద్యల్లో వేదవిద్య, మంత్రాల్లో ప్రణవం, ప్రియమైన వస్తువులలో ప్రాణం, ధేనువు ల్లో కామధేనువు, ఆయుధాల్లో వజ్రాయుధం, పక్షుల్లో గరుడుడు, వృక్షములలో కల్పవృక్షం, మాదిరిగా జల తీర్థాల్లో గంగాజల తీర్థం ఉత్తమోత్తమం అని , అంతేకాదు కృషి తో సమానమైన తృప్తి, వ్యవసాయము తో సమానమైన వ్యాపారం, సత్యం తో సమానమైన యశస్సు, ధర్మం తో సమానమైన నా స్నేహ తత్వం ఉండనట్లే గంగాజల తీర్థ ధనంతో సమానమైనది మరొకటి లేదు. ఇలాంటి గంగాజల తీర్థం వల్ల మనకు మంచి బుద్ధి, సు సుఖం కలుగుతుందని"తస్య గంగాజల సంప్రోక్షణం బుధ్ధి సౌఖ్యం వృణామ్భవేత్ "అను మంత్రం ద్వారా తెలియుచున్నది.
             ఈ గంగాజలం పుట్టుపూర్వోత్తరాల కు మనం వెళ్ళినట్లయితే, తొలి జన్మలో గర్ధమ పుత్రియైన కళ ఈమె తల్లి. మరీచి ఈమె తండ్రి. అప్పుడు గంగ పేరు పూర్ణిమ. ఈమె జన్మాంతరమున హరి పద ప్రక్షాళిత జలమున గంగ అను పేరుతో పుట్టెను. ఈమెకు  దేవకుళ్యయను కూతురు, విరజుడను పుత్రుడును కలిగిరి. విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి విజృంభించి ఆకాశాన్ని తన పాదము చే కప్పి నప్పుడు బ్రహ్మ తన కమండలోదకముచే వామనుని పాదమును కలడిగెను. ఆ కడిగిన పవిత్ర జలమే గంగానదియై ప్రవహించెను.  అది భగీరథుని చే భూతలమున కు కొని రా బడుట చేతను గంగకు భగీరథిఅని పేరు వచ్చెను. భగీరథుని వెను వెంట వస్తున్న గంగ యాగం చేస్తున్న జహ్నుడు అను ఋషి తపో స్థలాన్ని ముంచేసింది.జహ్నుడు కోపగించి గంగాజలాంన్నతా త్రాగే శాడు.
        అంతటి భగీరథుడు గంగను విడువమని ప్రార్థించగా ఆఋషి కనికరించి గంగను వదిలెను.జహ్నుడిచే వదలబడిన గంగకు జాహ్నవి అని అప్పటి నుంచి పేరు వచ్చెను. పంచభూతాల్లో జలం శ్రేష్టమైనది. గంగాజలం మరీ పరమోత్తమమైనది. పరమపావనమైన ఈ గంగాజల తీర్థ పానం సర్వ పాపములను హరించివేస్తుంది. అద్వైత బుద్ధిని ఇస్తుంది. అందరికీ భక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. ఇష్ట కార్య సిద్ధి రస్తుని కల్గిస్తుంది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ గంగాజల వేగం ప్రశస్తమైనది. శుభప్రదమైనది. పుణ్య వంతమైనది బ్రహ్మ హత్య పాపాల్ని పవిత్రీకరిస్తుంది. ఈ గంగాజల తీర్థం పుణ్యదినాన మూడుసార్లు పానం చేసి దశ దిశ దేవాలయ తీర్థాల్లో మునిగిన వారికి ప్రజ్ఞ లక్ష్మి, యశస్సు, ధ్యానయోగం , ధర్మం, వైరాగ్యం, మనస్శుధ్ధి కలుగుతుంది. సమస్త పాపాల్ని ఉపశమింప చేసి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుందని "వియద్గంగేతి నామ్నావైతీర్తమస్తి మహత్తరం సర్వ పాప ప్రశాంతమైన మయూరారోగ్య వర్ధనం"అను శ్లోకం ద్వారా తెలుస్తోంది. అన్నదానం, వస్త్ర దానం, సువర్ణ దానం, గోదానం, భూదానం, కన్యాదానం మొదలగు దానాలు చేసి ఇ గంగాజల తీర్థ దానం చేయనందున హేమాంగుడను రాజు కుటుంబ భారం వలన దారిద్రం చే బాధపడి భద్రావతి కి దానం చేయనందున నఘోశుడు వివేక హీనులు అయినారు. అట్లే స్వధర్మ  పరాయణుడైన బ్రాహ్మణుడు ముఖ స్వరూపాన్ని పోగొట్టుకున్న వృత్తాంతం దీనికి మంచి ఉదాహరణ.
              గంగాజలం పరమ పవిత్ర తీర్ధ మనియు, అది ఎన్నటికీ చెడిపోదు అని, ఇట్టి గంగాజలంతో స్నానం చేయుట గొప్ప అదృష్టమని ఈ అదృష్టం మానవులకు కలుగుట ఆ సర్వేశ్వరుడు మనకు ఇచ్చిన గొప్ప వరం అని మన భారతీయులు గాక ప్రపంచంలో ఉన్న ఇతర దేశస్తులు సహితం నమ్మి నారు.డి హారెల్ అను ఫ్రాన్సు దేశస్థుడు ఈ గంగా జలాన్ని సేకరించి తన పరిశోధనశాలలో పరీక్షించాడు. అందులో ఒక్క crimi కూడా లేదని ధ్రువీకరించి హా జలంతో తాను ఓ అవధ ద్రవాన్ని కనుగొన్నాడు. దానికి కి "బ్యాక్ట్రియోభేజి"అని పేరు కూడా పెట్టినాడు. ఈ ఔషధ ద్రవాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలకు కు సరఫరా చేయించి ఉపయోగంలోకి తెచ్చినాడు. సర్వ వ్యాధులకు ఈ ద్రవాన్ని వాడి చూడగా అన్నీ నయమైనాయని, అంతేగాకుండా ఎంతోమంది ఇతర శాస్త్రజ్ఞులు కూడా ఈ 
ద్రవ ప్రభావంపై తిరిగి పరిశోధనలు చేయగా గా ఈ విషయం తేలినట్లు అతను స్వయంగా గా  తాను వ్రాసిన "హిస్టరీ ఆఫ్ కౌంటర్ బ్యాక్టీరియా స్" అను గ్రంథములో తెలిపినాడు. అందుకేనేమో ఇప్పుడు గృహాలను, గుడి గోపురాలను, భూములను శుద్ధి చేసే కార్యక్రమాల అన్నింటికీ మనం పరమ పవిత్రమైన ఈ గంగాజలాన్ని వాడుతున్నాము. పండుగ పబ్బాల, వ్రతాల, వివాహాది శుభకార్యాలు అన్నింటిలో నూ తీర్థంగా మనం ఈ గంగాజలాన్ని ఉపయోగిస్తున్నాము. ఇది మనందరికీ అనుభవైక్యమేగదా !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.
సెల్ నెంబర్.,9491387977.

0/Post a Comment/Comments