జవానులం మేం జవానులం. ---బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . జిల్లా నాగర్ కర్నూల్. సెల్ నెం.9491387977. తెలంగాణ రాష్ట్రం.

జవానులం మేం జవానులం. ---బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . జిల్లా నాగర్ కర్నూల్. సెల్ నెం.9491387977. తెలంగాణ రాష్ట్రం.

జవానులం మేం జవానులం
***********"***********

జవానులం మేం జవానులం
మా భరతమాత గర్భమందు
జన్మించిన మేం వరవీరులం
జనాభిమానం జవానులం !

జవానులం మేం జవానులం
బాల జవానులం గోపాల జవానులం
ఆబాలగోపాలం శ్రేయస్సు మాధ్యేయం
అవలీలగా ముగిస్తాం మా అధ్యాయం !

ప్రవాస భారతీయుల వీరులం మేం
సహవాసం చేయు కార్యశూరులం
అన్యం పుణ్యం ఎరుగని వార లం
మన్యం సైన్యం కంకణం ధారులం !

మా కన్నతల్లి కడుపులోన దాగి
పుట్టినట్టి గట్టి పిండం పుత్రులం
మా కున్న ఇంటి గడపలోన వేగ
కాలు పెట్టినట్టి చిట్టి క్షతగాత్రులం !

అయినా మాకు లేనేలేదులే
మా మదిలోన ఏలాంటి చింత
ఏది ఏమైనా మేం ఆగకుండా
మా గస్తీని కొనసాగిస్తాం మంత !

మేం భారతీయ వీరులం
మా భరతమాత పుత్రులం
పుట్టినప్పుడు  కిసానులం
పెరిగి అయ్యాం జవానులం!

జవాను లం మేము జవానులం
మా వందేమాతరం జవానులం
మా గస్తీని ఎల్లప్పుడు కొనసాగిస్తం
మా నిరంతరం నిద్రకు సెలవిస్తాం !

జవానులం మేం జవానులం
నవ యుగ వీర జవానులంం
మా కలియుగ జనం జవానులం
ఈ ఆకలియుగం ఘనజవానులం

మేము ఏమాత్రం ఎవరికి వెరువం
మా దేశం సరిహద్దులో నిరంతరం
మేం సదా నిలుస్తూ కాపల కాస్తాం
మా పోరాటంతో మేమే  గెలుస్తాం !

మా జనం ధనం ప్రోత్సాహంతో
మా కాయం ఇంధన ఉత్సాహంతో
మేం దేశం సరిహద్దు లో నిలుస్తాం
యధాతధా ఏ దేశాన్నైనాగెలుస్తాం

--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments