పండుగలు ఎవరికోసం ఎందుకు ?
-----------------------------------
ఏటేటా మనం చేస్తున్న మన సాంప్రదాయ పండుగలన్నీ గ్రామీణ కర్షక కార్మికుల కోసం సృష్టించబడ్డాయి. సంవత్సరాంతం పంట పొలాల్లోను, పశుపోషణ తోను సతమతమౌతూ రేయనక పగలనక శారీరకంగా అలసి సొలసి నలిగిపోయే కర్షక వర్గం కోసమే ముఖ్యంగా ఈ పండుగలు మన పూర్వీకులు నిర్దేశించారు.
కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సాలె, మొదలైన వారందరికీ అమావాస్య య, పున్నమి దినాలు సెలవు దినాలుగా పూర్వము ఉండేవి. అన్నదాత లై పంటలు పండించే కర్షకులకు ప్రత్యేకంగా గా సెలవు దినాలు ఉండేవికావు. ఆనందంగా తన జీవితాన్ని గడిపే తీరిక కూడా వారికి ఉండేది కాదు . కాబట్టి కర్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని పొలాలలో పని ఉండని సమయములో పండుగలు వచ్చేటట్లుగా మన పూర్వీకులు చేశారు రు ఈనాడు మనం చూస్తున్నట్లుగా కాలువలు పూర్వము ఉండేవి కావు. కాలువల ద్వారా నీరు నడిపించుకొని వ్యవసాయం చేయడం ఆనాటి వారికి తెలియదు. కేవలం వర్షాధారంగానే వారు పంటలు పండించుకునే వారు. గత పదిపదిహేను సంవత్సరాల నుండి మాత్రమే కాలువలు మనకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుండి ఇ వ్యవసాయం చేయడం మొదలయ్యింది. అంతకుముందు బావులు తొవ్వి ఏతంఏసి వ్యవసాయం చేసే పద్ధతి ఉండేది.
మన ముఖ్యమైన పండుగలు వ్యవసాయ క్షేత్రాల్లో పని ఉండే కాలాల్లో రావు. సంక్రాంతి మనకు ముఖ్యమైన పండుగ. ఒక విధంగా ఈ పండుగ వ్యవసాయదారుల పండుగ. రైతులు ఇంటి నిండా ధాన్యలక్ష్మి కళకళలాడుతూ ఉండేది ఇప్పుడే. పశువులు మేత మేసి చక్కగా పాలను ఇచ్చేది కూడా డా ఇప్పుడే. ఈ పండుగకు కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగ తెలుగువారి పండుగ రైతు బంధువులందరూ రూ పేద ప్రజలకు తప్పకుండా విరివిగా ధాన్యాన్ని దానం చేసేవారు. మంగలి , చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మొదలగు వారికి కూడా ఉచితంగా ధాన్యాన్ని ఇచ్చేవారు. నెల రోజులు జరుపుకునే నేనే పండుగ ఇది. హరిదాసులు సంకీర్తనతో రకరకాలైన రంగురంగుల రంగవల్లికలతో, గంగిరెద్దుల ఊరేగింపు లతో, నోరూరించే పిండివంటలతో పడుచు పిల్లల గొబ్బెమ్మల ఆటపాటలతో హాయి నిచ్చే పండుగ ఈ సంక్రాంతి.
మనకు దసరా పండుగ కూడా ముఖ్యమైనదే. తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా ఈ విజయదశమిని జరుపుకుంటారు. ఇది శక్తి సంకేతం పండుగ. ఈ సందర్భంగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు దేవీ నవరాత్రులలో మనిషికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచి ఇచ్చే పురాణాలు హరికథలు, నాటకాలు, బుర్రకథలు తోలుబొమ్మలాటలు మొదలగు ఎన్నెన్నో వినోదాలు ఉంటాయి. ఇదేవిధంగా అన్ని పండుగలు కూడా. జీవితంలో కష్టాలు, సుఖాలు సహజమని చెబుతూ వేపపువ్వు లో బెల్లం వేసి పచ్చడి చేసి తినే ఉగాది పండుగ, హిందువులంతా ఐక్యతతో ఉండాలని అని చేసుకునే పండుగ వినాయక చవితి. కురిసే వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల గంధకం పొడితో పొగలతో నాశనం చేసి చేసుకునే పండుగ దీపావళి.
మనం ఇప్పుడు మన సాంప్రదాయ పండుగలను మరిచిపోతున్నాం. జనవరి ఒకటో తారీఖును కొత్త సంవత్సరంగా ఆచరిస్తూ రాత్రంతా మేల్కొని పరాయి దేశం పద్ధతులను పాటిస్తున్నం. వాలెంటైన్స్ డే వంటి విదేశ పండుగలను జరుపుతున్నాం. పాశ్చాత్య ప్రభావానికి లొంగి పోతున్నాం. మన పండుగలు దండుగ అని భావిస్తూ మరుగున పడేలా వ్యవహరిస్తున్నాం.
అలనాటి వారికి ఈనాటి సుఖాలు వసతులు అసలు లేనే లేవు. కాబట్టి ఇ పండుగలు, పర్వదినాలు ఉండేవి. పండుగ సమయాలలోనే ఆత్మీయులతో, బంధుమిత్రులతో కన్నబిడ్డల తో కాలం గడిపే వారందరికీ ఈ పండుగలు అత్యంత ఆవశ్యకం. జరిపి సుఖసంతోషాలతో కలకాలం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అందరూ వర్ధిల్లాలని ఆశిద్దాం.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.