అజ్ఞాత వ్యక్తి (బాలల కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్ర .సెల్ నెంబర్ 9491387977.

అజ్ఞాత వ్యక్తి (బాలల కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్ర .సెల్ నెంబర్ 9491387977.

అజ్ఞాత వ్యక్తి

అదొక వృద్ధాశ్రమము. పూలమాలలతో అలంకరించబడిన ఒక క శిలా విగ్రహాం ముందు వృద్ధుల అందరూ చేరి భజన సంకీర్తనలతో కీర్తి స్తూ తమలో తాము తన్మయం చెందుతున్నారు.
అప్పుడే విచ్చేసిన స్థానిక పత్రికా విలేకరులను గమనించిన ఆ ఆశ్రమ నిర్వాహకుడు శ్రీధర్ శర్మ"మీరంతా మూకుమ్మడిగా విచ్చేసిన కారణం ఏమిటి? అనగా గా దిన దిన ప్రవర్త మాన మై విలసిల్లుతున్న వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందించే ప్రధాన వ్యక్తి ఎవరు? ఆయనను గూర్చిన వివరాలు తెలపండి "అని విలేకరులు ప్రశ్నించారు.
         అప్పుడు శర్మ గారు "ఆయనఎవరోమాకు తెలియదు. ఈ విషయం గూర్చి మీరు మా మేనేజర్ రాఘవరావును కలవండి"
అనగా విలేకరులు వెంటనే పక్క రూమ్ లో ఉన్న రాఘవరావును కలిశారు. విలేకరులను గమనించిన రాఘవరావు వారిని ఆహ్వానించాడు. చూడండి  రాఘవ రావు గారు"ఈ ఆశ్రమ నిర్వహణ కై ఖర్చు నంత భరిస్తూ అజ్ఞాతంగా ఉన్న వ్యక్తి మీకు తెలుసు అనుకుంటాం. అతన్ని గూర్చి చెప్పండి"అనగా"చూడండి నాకు కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియదు నా మిత్రుడు రమాకాంత్ గారు మిల్ట్రీ లో సైనికునిగ పని చేస్తున్నాడు అతనే అన్ని ఖర్చులు భరిస్తూ నెల నెల మాకు డబ్బులు పంపిస్తున్నాడు. నిర్వహణ బాధ్యతను నన్ను వహించమని కోరాడు. ఈ శిలా విగ్రహాన్ని కూడా ఆయనే పంపించాడు. ఈ విగ్రహాన్ని చూసి నా మిత్రుడు కాడని తెలుసుకున్నాను వేరే ఎవరో ఉండి నా మిత్రుని ద్వారా ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడని మా కనిపిస్తుంది అని అన్నాడు రాఘవరావు
       ఈ కథనాన్ని నిన్న విలేకరులు మిలట్రీ లో పనిచేస్తున్న రమాకాంత్ గారిని కలిసారు"ఏమండి రమాకాంత్ గారు! మా రాష్ట్రంలో నిర్వహించబడుతున్న అనాధ వృద్దాశ్రమంఫౌండర్ ఎవరు? అని అడగగా"తప్పకుండా చెబుతా. ఆ అజ్ఞాత వ్యక్తి ఇ కోరిక మేర ఇంతవరకు ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇప్పుడు ఆయన నా లేడు యుద్ధంలో పరమపదించి అమరజీవి అయినాడు. అతనే కల్నల్ సూర్య సంతోష్ కుమార్.
ఇతను ఒక అనాథ. ఇతని తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. తలదాచుకునేందుకు ఇల్లు ఇడుపు గూడా లేనివారు. వారికి ఇతను ఒక్కడే కొడుకు. బస్టాండ్ లో చెడి పడియున్న ఓ పాత బస్సు లో కాపురం చేస్తూ ఇతన్ని సర్కారు బడిలో చదివించారు.
       ఒక నాడు ఇతని తల్లిదండ్రులకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లిదండ్రుల పరిస్థితి గమనించి సంతోష్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకెళుతుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి తల్లిదండ్రులు దారిలోనే మరణించారు. పాపం సంతోష్ అనాధ అయ్యాడు. అప్పటికే ఇంటర్ పూర్తి చేసిన అతను గత్యంతరం లేక మిలటరీలో చేరాడు. సైనికుడిగా ఎదిగి కల్నన్ పోస్ట్ పై కాశ్మీర్ బార్డర్ కు బదిలీ అయ్యాడు. అప్పుడే నాకు మిత్రుడు అయ్యాడు. ఏదీ దాచకుండా తన కథనంతా నాకు చెప్పాడు. తన తల్లిదండ్రుల స్మార్త స్మారకార్థం అనాధలు అయినా పండుటాకుల కోసమే ఈ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాడు. నన్ను నిర్వహించామని కోరడంతో నా మిత్రుని కోరిక మేరకు నేను ను నా మిత్రుడైన రాఘవరావు ద్వారా ఈ పవిత్ర వృద్ధాశ్రమానికి తోడ్పాటును అందిస్తున్నాను. ఇవి నా మిత్రుని యొక్క సంతోష్ అజ్ఞాత సంస్మరణ అంశాలు అని చెప్పాడు.
       విలేకరులు ఆ చెప్పిన అంశాలను ఫోటోలతో సహా పత్రికలలో ప్రచురించారు నివాళులు అర్పిస్తూ మీడియాకు అన్ని విషయాలు చేరవేశారు. పత్రికలలో వచ్చిన విశేషాలను ఫోటోలతో సహా చూసిన ఆ ఆశ్రమ వృద్ధులు అందరూ కలిసి ఇ ఓ స్మారక సభను నిర్వహించి తమ తమ ప్రగాఢ సంతాపం తో కూడుకున్న నివాళులు అర్పించి సూర్య కుమార్ సంతోష్  కల్నన్ శిలా విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments