🦹♀️🦹♀️తెలుగు భాష పిల్లలం.
=====================.
మేం తెలుగు తల్లి పిల్లలం
మా వెలుగు మల్లి మల్లెలం
మా మాతృభాష తెలుగు
స్తోత్రపాఠమై ఇల వెలుగు.
తెలుగు భారతికి పుట్టిన పుత్రులం
వెలుగు హారతి పట్టిన మిత్రులం.
తెలుగు భాష నేర్చుకున్న వారలం.
కలుగు ఆశ తీర్చుకున్న పోరలం.
మా తెలుగు భాష తేనె కన్న
వెలుగు జిలుగు పూల తావి కన్న
మన్నికై ఎన్నికై వెలుగు తున్నది
మిన్నయై తాను కీర్తి కలిగియున్నది
అచ్చుల హల్లుల కల్గి యున్న భాష
మా ఆశ ద్యాసై వెలుగుతున్న శ్వాస
అసలే మరువంగా మేం హమేషా.
సిసలైనది మా ఈ తెలుగు భాష.
కృష్ణదేవరాయలే మెచ్చుకున్న భాష
క్లిష్టతేలేని మా స్వేచ్చమైన శ్వాస.
మా ఉచ్చ్వాస నిచ్చ్వాసలోఉన్నది
విశ్వమంత తానై ఊరేగుతున్న ది
ముత్యాలాంటి అక్షరాలు ఉన్నది
సత్యాలాంటి లక్షణాలు కన్నది
వెలుగు జిలుగు కల్గి యున్నది
తెలుగువారి పెన్నధై వెల్గుతున్నది.
మమతా మాధుర్యం నింపుకున్న
సమతా సౌగంధం వంపుకున్న
సమతా మమతల బంగారం భాష
కమతం కవనంల సింగారం ఘోష.
చిత్రకవిత్వంతో చిందులేస్తున్నది
బంధకవిత్వంతో విందు చేస్తున్నది
అందమైన భాష మన తెలుగు
బంధమైన శ్వాసయై ఇల వెలుగు.
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.
సెల్,నెం.9491387977.