కరోనాకప్పా

కరోనాకప్పా

       కరోనా కప్పా

ఎగురుతుంది ఎగురుతుంది
 ఓ మాయదారి కరోనా కప్పా
 తిరుగుతుంది తిరుగుతుంది
 తనచుట్టు తాను యంచక్క !

మనదేశమందు అది కనిపించే
ఘన సందేశం తాను వినిపించే
మునుముందే జాగ్రత్త పడండి
లేకుంటే మీపని ఇక ఔటేనండి !

గాలి ద్వారా సోకుతుంది ఈ కరోనా
తెలుసుకొని నడుచుకో ఇక సరేనా
అలా ఉంటేనే నీకు జరుగు మంచి
లేకుంటేఅది తినేస్తుంది నిన్నుదంచి

కరోనా సోకిన దిక్కుల గుర్తించు
శానిటేషన్ కార్యక్రమం నిర్వర్తించు
తక్షణంఅది నీబాధ్యతగా భావించు
రక్షణ దాతవై సదా నీవు జీవించు !

మన ఇంట్లోకి ఎవరిని రానీయొద్దు
ఎదురింట్లోకి మనంఎవరం పోవద్దు
ఎవరి ఇంట్లో వాళ్ళుంటేనే ముద్దు
కరోన అవుతుంది అప్పుడు రద్దు !

కరోనకప్ప పడగను ఒడుపుగ పట్టు
కసితీర దానిని నీవు నేలకేసి కొట్టు
పంతంతో పెంచుకోర ఇక నీ పట్టు
గుంతలోన లేవకుండా పాతిపెట్టు !

కరోనా వైరసునూ  కక్కించు
ఉరి కంబానికి వెంటనే ఎక్కించు
సంతోషిస్తారులే ఇక జనమంతా
అంతటితో తొలిగిపోవు వారిచింత!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments