🙏🏼మా చదువుల దేవుడు🙏🏼
ఏలాంటి మచ్చలేని మహా మనీషి
మా రాయలసీమ శ్రీరాజశేఖరరెడ్డి
ప్రజలందరు తెగ మెచ్చిన నచ్చిన
మెరిసే విరిసే మా బంగారపు కడ్డి !
మనం ఎరిగిన మంచి మనిషి
మన మనసెరిగిన మహామనీషి
జలయజ్ఞం అందించిన ప్రధాత
జనులందరి హృదయాధి నేత !
మధ్యజనులనాడి పసిగట్టినవాడు
విద్యయొక్కవిలువ గుర్తించిన రేడు
విద్యాలయాల నిర్మించిన ఘనుడు
విద్యార్థులమదిలో మెరిసే ఇనుడు!
పిల్లలందరికీ ఉచిత విద్య నందించి
చిల్లెరమల్లెర ఫీజుల తానే భరించి
మార్గ దర్శకుడైన మహానుభావుడా
వారి మదిలో జీవించిన మాదేవుడా
విద్యావిపిని ధాటికి నీవు తట్టుకొని
విద్యార్థులందరిని వెంటబెట్టుకొని
ప్రవేటు బడులను చేసావులే కట్టడి
ఆటుపోటులతట్టుకొనినీవీముట్టడి
పిల్లలందరినీ పల్లెల్లో బడికి పంపి
జ్ఞానామృతాన్ని వారికి నీ వొంపి
సరస్వతి పుత్రులుగా మార్చావు
సారస్వత లోటును నీవు తీర్చావు
విద్యార్థులకు దారి చూపిన వాడవు
వారికివెన్నుదన్నగ నిలిచిన నీడవు
చదువుల కరువు తీర్చిన దేవుడవు
పదవులబరువుమోసిన భానుడవు
మస్తు ప్రాథమిక పాఠశాలలు కట్టించారు
పుస్తక భాండాగారములను పెట్టించారు
చదువుల దీపాలను వెలిగించారు
పదవుల పాపాలను తొలిగించారు
చదువుల నందించిన మా చదువుల దేవుడవు
మమ్ముల దీవించిన మా మహానుభావుడవు
మా వేలవేల దండాలు అందుకో నీవయ్యా
మా గుండెల్లోన కొలువైన నిలిచిపో నీవయ్యా!
గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.