మా అమ్మే మా దైవం . (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా .సెల్ నెంబర్.9491387977. తెలంగాణ రాష్ట్రం.

మా అమ్మే మా దైవం . (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా .సెల్ నెంబర్.9491387977. తెలంగాణ రాష్ట్రం.

మా అమ్మే మా దైవం
--------------------

అమ్మ అనే పదము
ఎంత కమ్మదనము
అమ్మ పలికే పలుకు
తేనె సుధల చిలుకు !

మాఅమ్మ ఇచ్చే తీపి ముద్దు
మేం పుచ్చుకొని ప్రతి పొద్దు
నిదుర రాదులే మా కంటికి
నిలకడేది ఇక  ఈ ఒంటికి !

మాకు పాల బువ్వ  తినిపించి
సోకుగా జోల పాట వినిపించి
ముత్యాల ఉయ్యాల ఊపుతుంది
రత్నాల జంపాలను చూపుతుంది

నయమున ముద్దులను ఇస్తుంది
రయమున బొమ్మలను తెస్తుంది
బొమ్మల కొలువులను పెట్టిస్తుంది
మమ్ముల ఆనందం అట పట్టిస్తుంది

కనిపించే దైవం మా అమ్మ
కని పెంచే వైనం నీవేనమ్మ
గుడిలోని దేవుని కన్న మిన్న
గుండెలో దాగిన మా అమ్మ !

అమ్మ అంటేనే ఓంకారం
కమ్మని ప్రేమ  మమకారం
శ్రీకారంతో మన బ్రతుకునకు
కట్టినట్టి గట్టి  ఘన ప్రాకారం !

అద్భుతమైన అమృతభాండం అమ్మ
అద్వితీయమైన మన కల్పవృక్షం కొమ్మ
కలలో గూడా మరువం మేం నిత్యం నిన్నమ్మ
ఇలలోన నీకు నీవే సాటిగదమ్మ మాయమ్మ !

--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments