మన ఋషులు -వారు వ్రాసిన గ్రంథాలు. వివరణ-ఓ చిన్న పరిశీలన
--------------------------------------------
మన ప్రాచీన ఋషులందరూ జగత్ కళ్యాణం కోసం బ్రహ్మచర్యం స్వీకరించి, తమ జీవితకాలమంతా పరిశోదించి మనకు అవసరమగు ఎన్నోశాస్త్రగ్రంధాలను రచించి మనకందించారు. ఈనాడు మనం చూస్తున్న, అనుభవిస్తున్న, ఆనందిస్తున్న సమస్తము మన ఋషుల పుణ్యమే.
వాటిని మన ఋషులు కనుగొన్నారు అంటే, అంత త్వరగా నమ్మలేం. కానీ ఇది వాస్తవం. నేడు డు మనం ఉపయోగిస్తున్న విమానాలు, విద్యుత్తు, దూరవాణి, వైద్య శాస్త్రము, ప్రయోగాల ప్లాస్టిక్, శరీరానికి పుష్టినిచ్చే చే విటమిన్లు మొట్టమొదట కనుగొన్నది మన భారతీయ ఋషి పుంగవులే. భూమి గుండ్రంగా ఉందని, సముద్రం మూడు అంచెలుగా భూమిని ఆక్రమిస్తూ ఉందని, అతి సెక్స్ అనేక రోగాలను సృష్టిస్తుందని, మనను మనం పునీతం చేసుకొనుటకు ఆధ్యాత్మిక రంగం కూడా అత్యావశ్యకమనీ గుర్తించింది మన ఋషులే.
పురుషులకు ఏకపత్నీ వ్రతాన్ని, స్త్రీలకు ప్రాతివత్యం ని శోధించి సాధించి మొదట కనుగొన్నది మన భారతీయ ఋషులు. శక్తి పూర్వకమైన "బి"విటమిన్ కలిగిన వరి, గోధుమ, జొన్నలు ప్రధాన ఆహారంగా అలవాటును చేసినవారు మన ఋషులే. మానవజాతికి ముఖ్యంగా ధనసంపాదన కాదని, జ్ఞాన సంపాదన ముఖ్యమని బోధించింది మన ఋషులే. మనుషులకు ఉపకరించి సేవచేసే జంతువులను ఆవు, మేక, గుర్రం, పంది , కుక్క, పెళ్లి, గాడిద, గేదె, కోడి, ఒంటె,ఏనుగు, మొదలగు శాకాహార సాధు జంతువులను జనావాసాలకు పెంపుడు గా చేసింది కూడా మన భారతీయ ఋషి పుంగవులే.
స్త్రీ, పురుషునికి వివాహం అనే సంబంధాన్ని సృష్టించింది ఋశులే. ఇట్టి ఋషులలో భరద్వాజ, అగస్త్య, అత్రి, విశ్వామిత్ర, ధన్వంతరి, అగ్నివేశుడు, అశ్విని కుమారులు,
భరతముని, కశ్యప మహర్షి, వాల్మీకి , సుకేశుడు,వాత్సాయనుడు, మతంగముని, మొదలగువారు.
భరద్వాజుడు ఆకాశంలో ప్రయాణించ దగిన రకరకాల విమానాల నిర్మాణాలను గురించి, సముద్ర ప్రయాణానికి ఉపయోగపడే పెద్ద పెద్ద ఆడవాళ్ళ ఒంటి ఓడల గురించి , భూమిపై అతి వేగంగా సంచరించ గల రథాలను గూర్చి యంత్ర శాస్త్రాన్ని వ్రాశాడు.
ఆగస్త్యమహాముని భూమి, విద్యుత్తు, సౌరశక్తి, అగ్ని శక్తి మొదలగు శక్తుల గురించి శక్తి శాస్త్రాన్ని రాశాడు.
విశ్వామిత్ర మహర్షి రకరకాలైన అస్త్రములను ను ప్రయోగించే విధానం గురించి చి, దీక్ష, సంగ్రహం సిద్ధాంత ప్రయోగం అనే నాలుగు విధముల ఆయుధాలను, వాటి నిర్మాణాలను గురించి వ్రాశాడు.
ధన్వంతరి, అగ్నివేశుడు, అత్రి భరద్వాజుడు వైద్య శాస్త్రం గురించి ఆయుర్వేదమును వ్రాశారు.
అశ్విని కుమారుడు రస శాస్త్రం, ధాతు శాస్త్రం, లోహ శాస్త్రం రాశాడు.
భరతముని సంగీతం నాట్యం గాన వృత్తాలను వివరించే గంధర్వ శాస్త్రాన్ని వ్రాశాడు.
కశ్యప మహర్షి ఇనుము మొదలగు లోహాల ఉపయోగాలను, వాటిని వాడకుండా భవంతుల వంతెనల నిర్మాణాలను, శిల్పాల చెక్కడం వాటి కొలతలను గురించి వ్రాశాడు.
కండ్రిక మహర్షి శబ్దశాస్త్రం గురించి వ్రాశాడు.
వాల్మీకి మహర్షి అక్షరలక్షలు అనే సర్వ శాస్త్రం రాశాడు దీనిలో కళా శాస్త్రాలు ఉన్నాయి గణిత శాస్త్రం, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
సుకేశ ముని పాకశాస్త్రం రాశాడు.
వాత్సాయనుడు రత్నశాస్త్రం రాశాడు. మతంగ మహర్షి యోచన శాస్త్రం రాశాడు.
ఆర్యభట్టు సున్నా ను కనుగొని గణిత శాస్త్రాన్ని సులభతరం చేశాడు.
ఇలా మన ప్రాచీన మహర్షుల శ్రమ ఫలితాన్ని మనమిప్పుడు ఎంతో హాయిగా అనుభవిస్తున్నాము. ఇట్టి మన ప్రాచీన పురుషుల అందరకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. మన భావాలకు భాషను కల్పించి ఇచ్చింది రుషి పుణ్యాత్ములే. కాబట్టి వారందరికీ మన జాతి తరపున వందనం ,అభివందనం, సుమ చందనం, సహస్ర పాదాభివందనం చేసి తరిద్దాం.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.