జవానులం-కిసానులం (కవిత)
------------------------------------------
కిసానులం మేం కిసానులం
జవానులం మేం జవానులం
ప్రప్రథమున మేం కిసానులం
మా ప్రయత్నంతో జవానులం !
మా కన్నతల్లి శ్రీమతి అన్నపూర్ణ
మాకున్న నాన్న శ్రీ శ్రీ శ్రీ దానకర్ణ
వారి ముద్దు మురిపాల పట్టీలం
వారికి పుట్టిన గట్టి జగత్ జట్టీలం !
కిసానులం మేం కిసానులం
మా భారతీయ కిసానులం
మేం హారతీయు కిసానులం
తస్మాత్ జాగ్రత్త జవానులం!
మా దేశం సరిహద్దు జవానులం
సందేశం ప్రతి పొద్దు అందుకున్న
కిసానులం మా భరతభూమి పూజ
చేసి తరించిన కిస్మత్ కిసానులం !
హలం పట్టి పొలం దున్ను హాలికులం
జలంపెట్టి గొర్రు కొట్టు శ్రామికులం
జన జాతర కిసానులం మేం ఇక
ఇల ఎవరికి కాములే బేమానులం !
మెంకిసానులం మాజన జవానులం
మాదుక్కిలోని అలం అంతా పీకేస్తాం
మొక్కి మా పొలంలోన ఎరువును వేస్తాం
ముద్దుగ ఖుద్దుగ వ్యవసాయం చేస్తాం !
పొలం చుట్టు దడిగట్టు కట్టుతాం మధ్యన ఓమంచను నిలబెట్టుతాం
వాలేటి పక్షులనూ మేం కొట్టుతాం
రాలే ధాన్యంకై మాదోసిలి పట్టుతాం
చెత్త చెదారమును మేం పోగేస్తాం
కంపోస్ట్ ఎరువును తయారుచేస్తాం
మా పంట పొలానికి మేం తోలేస్తాం
మేం బంగారు పంటలను పండిస్తాం
కూరగాయలను ఆకుకూరలను
దండిగా మా పొలంలోపండిస్తాం
మేం వెంటనే మా రైతు బజారుకు
మా ఎడ్లబండిలోవాటిని తరలిస్తాం
మాకు నచ్చిన ధరకే అమ్ముతాం
వచ్చిన డబ్బుతో సరుకులకొంటాం
ఇంటికి వెంటనేమేం తిరిగొస్తుంటాం
కంటికి నచ్చినవన్నీ కొనేస్తుంటాం !
ఆహారం అనివార్యం అందరికి
ఆ ఆహారం అందేది ఎందరికి ?
అహరహం చేస్తాము వ్యవసాయం
అధికంగా తీస్తాము ఫలసాయం !
పై ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి
గుప్పిట్లోని ఈ గుట్టును విప్పండి
చెప్పకుండ మీరు తప్పుకోవద్దండి
చేప్పేస్తే మీరే అందరికీ ముద్దండి !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.