ఓ తల్లి ఆవేదన . గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా . సెల్ నెంబర్.9491387977..

ఓ తల్లి ఆవేదన . గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా . సెల్ నెంబర్.9491387977..

ఓ తల్లి ఆవేదన
-----------------

మా తలుపునేతట్టి జేగంటనే కొట్టి
మా ఇంటనే పుట్టి మొలతాడు గట్టి
మా జంట ఒడి వీడి ఏలోకానికెళ్ళావు కన్నా
మా కంటి తడిఆరకనేశోకాన నే మునిగి ఉన్నా !

తొలి ముద్దు మాటలతో అలరించినావే
మలిపొద్దు పాటలతో మా కల పెంచినావే
రేయనక పగలనక మా ప్రక్క నీవు చేరి
వారనక వీరనకఎంచక్కగాను మారి
నీ అధరాల అమృతం పంచినావోచిన్న
ఆ మధురిమల సొంపు పెంచినా వోకన్నా
బుడిబుడి నడకల ప్రాయంలో నీవుండి
తడిపొడి తపనల గాయం తో మా యద మండి
మా ఒడి జేర లేవా ఓ ముత్యాల కొమ్మా
మా గడిలో దూర లేవా మా రత్నాలబొమ్మా !

ఆ దేవదేవుడికి మా పైన కుట్టింది కన్ను
దివిసీమ గుడిలో బంధించగా నిన్ను
నీ అండ కోల్పోయి మా మనసు చితికింది
ఎండమావి లోన ఉషస్సును మామది వెతికింది !

జగమంత మురిపించు జస్వితవు అనుకుంటి
చీకు చింత మరిపించు బబ్బివని కలగంటి
మా కంటి కలలనే కళ్ళలుగా చేసావు తల్లీ
మీ ఇంటి ఎల్లలనే నీవు కుంగదీసావు మల్లి !

కనిపించేది ఎవరికి ఈ పాల బువ్వ
కొని పించేదెవరికి మా బూంది లడ్డు రవ్వ
వినిపించే దెవరికి చిట్టి పొట్టి కథల సారం
కన్నబిడ్డను కోల్పోయిన తల్లి బతుకంతా భారం !

మా కున్న సిరులన్ని నీ నవ్వులే
లేకున్న మా మరులన్ని కల పూవ్వులే
ముప్పొద్దు ముచ్చట్లు పెట్టుతుంటీవి
చప్పట్లు కొట్టేస్తూ ముద్దు పెట్టేస్తుంటే టివి !

పువ్వులే రువ్వేటి నీ నవ్వులేమాయే
తావు లే తప్పి మా నెలకు లే ఆగమ యే
నిన్ను మరిచి మేమింకా ఉండలేనమ్మా
వెన్ను చరిచి ఆదుకునేవారింక లేరమ్మ !

ఇరుగుపొరుగు పిల్లల చేరదీస్తూ ఉంటివి
తెరమరుగు కాకుండా వారిని మరిపిస్తూ ఉంటివి
చిలకపలుకులు నీవు పలుకుతూ ఉంటివి
మొలక నవ్వులతోనే మమ్ము మురిపిస్తూ ఉంటివి
నిన్ను ఎలా మరువగలను తల్లీ
ఈ భువిపై నేనింకా ఉండలేను మళ్ళి !

--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments