ఏది.. గొప్పదనం..!?_1
--- విన్నర్
చాలా మంది అనుకుంటున్నట్లు గౌరవం అన్నది
ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. "నేనే గొప్ప నాకే తెలుసు"
అన్న అహంకారం మనిషిని ఒంటరిగా మిగిలిస్తుంది. అందుకేఅందరూ సమానం అందరిలో ఎంతోకొంత నైపుణ్యాలు మిగిలి ఉంటాయని గ్రహించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది.ఒకరికి తెలిసిన ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు.నిత్య విద్యార్థి లా ఇతరుల నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. ఒకరికి తెలిసిన విషయం ఇతరులకు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు..!? అందుకే ఎవరిని తక్కువ అంచనా వేసే అవకాశం లేదు..!? ఒక "చిన్న పిల్లాడి" నుంచి సైతం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. అరె.. ఇది మనకు తెలిసిన విషయమే కదా అని అప్పుడు అనుకుంటాం..?కానీ అప్పటివరకు ఆ విషయం గురించి మనకు ఐడియా కూడ రాకపోవచ్చు..!?కానీ ఒక "ప్రేరణ"గా ఒక పిల్లాడు చేస్తున్నది,మనకు పనికి వచ్చిందా లేదా..!?అందుకే గ్రహించాల్సిన విషయం..ఎవ్వరిని తక్కువ అంచనా వేయవద్దు..!? ఒక్కొక్కరిలో ఒక్కో కళ ఉంటుంది. మనం దానిని స్వీకరించక తప్పదు..!? ఒకవేళ మనం స్వీకరించక పోతే అది మన "ఓర్వ లేనితనం" కిందికి వస్తుంది.!ఓర్వలేని గుణం మంచిది కాదు. అందుకే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని స్వీకరించాలి.ఒకవేళ చెడు అయితే దానిని నిరభ్యంతరంగా విస్మరించడం లో తప్పులేదు..!
మంచి విషయం మాత్రం ఉంటే ఖచ్చితంగా మనం దానిని స్వీకరించే తీరాలి.అందులోనే మన గొప్పతనం నిండి ఉంటుంది. ఈ లోకములో మన గొప్పతనం అంతా "స్వీకరించడం" మరియు "విస్మరించడం" లోనే ఉంది ఎక్కువ శాతం..! ఎందుకంటే "మంచి" "చెడు" విషయాలు ఇవి మనిషి విచక్షణా జ్ఞానాని కి సంబంధించినవి కనుక..! కేవలం మాటల ద్వారా, వేష భాషల ద్వారా,ఇతరత్రా ద్వారా మన గొప్పతనం ప్రదర్శించలేము. కేవలం కేవలం ఒక "వ్యవహారం" ద్వారానే మన గొప్పతనాన్ని మనం ప్రదర్శించగలము. "ప్రదర్శనా బుద్ధి" తో గల గొప్పదనం